Skip to content
May 16, 2024 / subramanyam

Mr. and Mrs.Poonawala — My Take

I was dusting and cleaning my bookshelf over the last weekend when my eyes fell on the book Mr. and Mrs. Poonawala. This book had been on my list for quite some time. I read the first chapter some years ago. However, I had to put the book aside for some reason that I do not remember now. Well, as I got a chance, I began rereading the book. 

The book is the story of a quintessential next-door boy and a mature yet curious girl. Fate brings them closer via an Arranged marriage, how they develop friendships, how they come close to each other, and what they learn in the process forms the rest of the book.  

The start seems off-topic, but the author knits it back into the story excellently. The first conversation between the couple sounded offbeat for a first date, but I eventually started looking for more conversations between Sameer and Megha. While Sameer represents the run-of-the-mill life we live, Megha comes across as the fresh lease of life that we all want. 

The couple’s wedding and the arrangement of everything themselves are good. The conversations they have in the middle of all this make it even more interesting. In a way, the book is all about the conversations between the couple. They talk about abstract topics, and some of them are very good. All this makes the first part of the book a very good read. 

The second part of the book is when they go on a honeymoon to Paris.  This is where I felt there was a drag in the book. Here, Megha starts sounding very preachy. They are on honeymoon, and she is taking philosophy lessons; the author could have made this a little better. At a point, Megha seems too good and too intelligent for a human of that age. However, the author tries to normalize her and makes her seem like human again. However, this preaching business could have been avoided.

That’s my only complaint on this book.   

This is Shashank Chepuri’s first book, it is a good attempt. He also used nice vocabulary and ensured that for a large part the audience stay with him.  Wishing him more success in his future endeavors. 

Do pick the book when you are looking for a light hearted read. 

May 12, 2024 / subramanyam

The Scintillating Bazooka

We often see people (particularly people from Uttar Pradesh) singing paeans of Shri Yogi Adityanath for eliminating the Gundaraj plaguing the state. For someone unfamiliar with UP and the ground situation there, a simple question that would pop into the mind is, why such hullaballoo over maintaining law and order in a state? Isn’t that just a normal function of the government? Well, that thought process is absolutely right, except that the ground reality in UP is entirely different. The atrocities of the Bahubalis and their gangs in UP (in the pre-Yogi era) would make for a voluminous read. I wanted to know about the history of these gangs and was searching for good books on this subject. Amazon suggested “Operation Bazooka” to me, and I picked it up. 

Here is the blurb of the book. 

Who could pump 112 bullets to kill a man in a posh Lucknow locality?Why did a criminal hang around prep schools in Lucknow?How did a phone call to the daughter of a government engineer blow the lid off the plan to assassinate the Chief Minister of Uttar Pradesh?And who can tell the story of Operation Bazooka better than the man who was a part of it!

Police officer Rajesh Pandey was among the founding members of the UP STF (Special Task Force), created to nab Shriprakash Shukla – one of the most dreaded gangsters in Uttar Pradesh, The book gives a detailed account of the workings of the STF and how they nabbed the gangster. Read about the country’s first electronic surveillance unit developed by Pandey during the operation and how the police got the only photograph of the gangster available till date.

Operation Bazooka is a no-holds-barred, bone-chilling true account of Shriprakash Shukla’s reign of terror and how the STF went after him.

Since the blurb almost gives away most of the details, I would like to express my opinion here.  It is the story of the police operation on one of the most dreaded criminals of UP in the 90’s. The author could have made it “as a matter of fact” / “Bland” type of book. However, he decided to make it as interesting as possible. 

The author takes us to vintage Gorakhpur, the rugged roads, the innocent people , the trouble of the cable operators in collecting monthly dues and how they reach out to the local muscle men to collect that money.  This seemingly localized act gave birth to a monster, who kept India’s most populous state on the boil for 5 good years. We see how one wicked, ambitious man gets the patronage of a strong political man from a neighboring state and how this unholy alliance instills terror in the hearts of the people of UP and Bihar. 

Who was Shriprakash Shukla ? What was his modus operandi? How did he gain prominence? How did he get his hands on an AK-47? Who were his friends? Why were the police not able to tap his phone? Why were his photographs not available? Whom did he target? Did he ever have a weakness? What was his family background? How did he kill the number 2 in the then Bihar’s government? How did he become a headache for the police? Why was the STF created to nab him? What were the challenges for the STF? What did the STF do to him? You will find all the answers in the book. 

The author uses good vocabulary in the book, and I liked it.  The book is like a complete package. If you are interested in crime-related non-fiction this book is a must-read. 

Happy Reading 

April 30, 2024 / subramanyam

చీకట్లో సూర్యుడు — నా అభిప్రాయం

కారులో ఏదోఒకటి వినాలి అని అనిపించి అమేజాన్ ప్రైం లో పాడ్కాస్ట్లు వెతుక్కుంటున్నా, చీకట్లో సూర్యుడు ఒక పాడ్కాస్ట్ గా వచ్చింది. యండమూరి గారి మీద ఉన్న నమ్మకం తో ప్రారంభించా, ఒక రెండు ఎపిసోడ్లు విన్నాక ఇక పుస్తకం చదివేయాలనిపించి , ఆ పుస్తకం తీసుకొని చదివాను. ఈ పుస్తకం నాకెలా అనిపించిందనేదే ఈ టపా.

సరే యండమూరి గారి పుస్తకం ,పూర్తి అయితే తప్ప మనని నిద్రపోనివ్వదు , పేజీలు వాటంతట అవే తిరిగిపోతాయి ఇవన్నీ తెలిసినవే. కాకుంటె ఈ పుస్తకం లో యండమూరి గారు సైన్స్ ఫిక్షన్ లోకి వచ్చారు అదే చాలా కొత్తగా అనిపించింది.

కథావిషయాన్ని స్థూలంగా చూసే ప్రయత్నం చేద్దాం.
భూమి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం లో మరొక నక్షత్ర వీధి (గెలాక్సీ) లో ఉన్న కొందరు గ్రహాంతరవాసులు తమ ఇంధన అవసరాల కోసం సూర్యుడి నుండీ శక్తి ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు దీనిని ఎలా ఎదుర్కుంటారు/ప్రతిఘటిస్తారు అనేది ఇక్కడి కథావస్తువు.

ఖగోళ శాస్త్రం, ఏలియన్లు, సూర్యుడిలోని శక్తి , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కంప్యూటర్లు, మైక్రో మరియు మాలిక్యులర్ బయాలజీ పైన పనిచేసే శాస్త్రవేత్తలు, బ్లాక్ హోల్స్, స్పేస్ ట్రావెల్ ఇలా ఎన్నో విషయాలను ఒక కథలో పెట్టటం సామాన్యమైన విషయం కాదు. కథ లో ఉండే సామాన్యమైన కల్పన తో పాటు భవిష్యత్తులో వచ్చే ఈ సాంకేతికతని ఊహించుకొని వ్రాయాలి. ఇది రచయితకు ఖచ్చితం గా పరీక్షే . యండమూరి గారు చాలా చక్కగా కథను చెప్పారనే చెప్పాలి. వారు ఎన్నో విషయాలను అధ్యయనం చేసి ఈ కథను వ్రాసారని పాఠకులకు అర్థం అవుతుంది. ఈ విషయం లో వారిని అభినందించకుండా ఉండలేము.

పాత్రల మధ్య నడిచే సంభాషణలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని వాక్యాలు చాలా బాగా అనిపించాయి. నాకు బాగ నచ్చిన ఒక వాక్యం ఇక్కడ పంచుకుంటున్నాను.

“కలలో కూడా ఊహించలేని పనులు మనుషులు చేయగలిగారు . నిరాశావాదాన్ని జయించి ,అసాధ్యమనుకున్న పనులు చేసి అంతరిక్షంలో దూసుకుపోతున్నారు. కారణం ఆశావాదమే!”

యండమురి గారి పుస్తకానికి వంకపెట్టగలిగే ప్రతిభ నాకు లేదు, అయితే ఒక పాఠకునిగా నా అభిప్రాయం చెప్తున్నా.

ఒక ముగ్గురు ప్రతిభావంతుల మధ్య త్రికోణ ప్రేమకథ నడుస్తుంది, ఒక రకంగా రచయిత తనని తాను పరీక్షించుకున్నారేమో అని అనిపిస్తుంది. కథ బాగానే నడుస్తుంది, మరొక జోనర్ లో ఉంటే ఈ కథ ఇంకా బాగా పండి ఉండేదేమో అని నాకు అనిపించింది. అలాగే ఆకథకు ముగింపు సరిగా రాలేదు, అసలు కథను చక్కగా ముగించిన రచయిత ఈ కథను సరిగా ముగించకపోవడం కొంచెం నిరాశపరిచింది.

అలాగే పుస్తకానికి ముగింపు ఇంకొంచెం బాగా వ్రాయొచ్చేమో అని అనిపించింది. అద్భుతం గా సాగిన పుస్తకం హడావిడిగా ముగిసినట్టనిపించింది. (యండమూరి గారి మిగతా పుస్తకాలు చదవడం వలన అంచానలు పెరుగుతాయి కదా, బహుశా అందువలన ఈ ముగింపు నాకు నచ్చి ఉండకపోవచ్చు )

ఈ రెండు చిన్న విషయాలను పక్కనపెడితే పుస్తకం అద్భుతం గా ఉంది, సైన్స్ ఫిక్షన్ పైన ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా చదవవలసిన పుస్తకం ఇది.

December 31, 2023 / subramanyam

Retro of 2023.

The habit persists; here is the Thirteenth retro in a row.

As ever, let me start with the standard disclaimer. This post, another retro of my life, might drive you up the wall as it has no vital info other than the good, bad, and ugly of Subbu in 2023. Hence, think twice before you continue reading.

2023 will go down as an eventful year in my life. I had a few beautiful moments and some sad ones; I faced a good number of issues, was successful in solving a few of them, was able to get myself back on track for a few, and sadly, had to let go of a few things.

Things I tried my hands at

  1. Buying a car was something I had never thought I would do. However, it happened this year. Kudos to my wife, who nudged me in this direction. 
  2. Driving the car, I was very hesitant to drive; finally, I gathered the courage this year and drove the car for more than 300 km in a day, a great experience. 
  3. Learning some aspects of a language, i did too little to speak more about it. 
  4. I never went on a vacation before. I went to Goa with my family this year. We had a great time there. 

Good habits I started this year:

  1. Working on reducing weight. I was 87.5 at the start of the year and came to 76.
  2. Giving away things that do not use, I gave away a good number of books and clothes this year.

Old habits that persist: (This is a copy-paste from last year)

1. Laziness, Procrastination, and talkativeness. I am improving on them, but then again leaps and bounds to cover.

2. I start things, but I stop them. I want to improve on this front.

3. Scrolling through reels.

Moment(s) of the Year:

  1. When I got the nirmalya of Chilkur Balaji. No words can express the feeling. Indeed, it was a blessed day of my life. 
  2. When I got to go to Sajjangad for the second time in the same year. When I got a chance to do Abhishekam there.
  3. The moment I saw 76 on the weighing scale. 
  4. When I was invited as a guest speaker for a book launch, that was awesome.

Naaham kartaa Harih kartaa 

  1. Doing a complete reading of Srimad Ramayana. With the blessings of SriRamachandra and Guruvugaru, I completed 245 episodes this year. You can get the link here. This yagna is happening altogether because of the blessings of Sri Ramachandra and Guruvugaru only; otherwise, I cannot even dream of doing this.

Reading

I did read a decent set of books this year. Here is the list. :

  1. Indistractable
  2. The New Confessions of an Economic Hitman
  3. Calling Sehmat
  4. The Hidden Hindu (1, 2 and 3 parts)
  5. The Journey from Marx to Mother 
  6. Hindus in Hindu Rashtra
  7. SriMadRamayanam – Balanandini vyaakhya by Pullela SriRamachandrudu garu (Bala, Ayodhya, Aranya, Kishkindha and Sundarakandas set of 6 books)
  8. Sankaravijayam — Neti Suryanarayana Sarma 
  9. Saadhana Panchakam 
  10. Hindu Rakshakudu Chatrapati Sivaaji 
  11. Adugaduguna Gudi undi
  12. Bairagi 
  13. Vajrakundam 
  14. Chakrateertham 
  15. House surgeon 
  16. BahuLapanchami Jyotsna 

Professional life:

I am having many challenges here. 

I was recognized for my efforts, which gave me satisfaction.

Blogging :

I wrote only ten posts this year, eight more than last year, and finally, in the double digits. There is still a lot of ground to cover when I compare the numbers to the usual 100+ posts I used to write a few years ago. I have been trying to improve this in the past few years but have yet to succeed.  

Most embarrassing moment:

In the middle of a meeting, I got unmuted, and all the din was audible to all the participants. This happened in 2022 too, then in 2023 as well. 

Things I did not like about myself:

Almost a copy-paste from last year,

1. The only improvements were in the time spent with family and my eating habits 

2. Poor planning of things kept me in a tight spot quite several times.

3. Then, using office time for personal work. I improved the pace at which I work in the office, but I am sure that’s not enough. I am gradually losing touch with friends. I made some amends this year but need to move ahead. 

This list simply goes on…. I wish to correct most of the next year; let’s see what 2024 has in store for me.

I wish everyone a very happy English New Year 2024.

December 31, 2023 / subramanyam

Influence of Kuchipudi on AP’s cultural identity

This is another question on quora, to which I gave an answer.

A proper Kuchipudi dancer would have answered this question better.

I am only making my humble submission as I have very limited knowledge.

Kuchipudi dance’s main focus on the expression and grace. The most famous composition/dance of this

dance form is Bhama Kalapam.

Bhama Kalapam is the dialogue between Satyabhama and Sri Krishna, here SatyaBhama is depicted as the

proud wife who believes that her husband cannot defy her order. Thanks to Kuchipudi , this image of Satyabhama is etched in the memories of Telugu people. We do not know if the original Satyabhama behaved like that with Bhagavan Shri Krishna, we telugu’s believe that she was the lady who loved controlling her husband. My sincere apologies to SatyaBhama devi incase the depiction is wrong.

There have been many movies on this too. That’s the impact of Kuchipudi , one of the dances in this dance form changed the perception of puranic people in the eyes of Telugus.

November 26, 2023 / subramanyam

భరతుడెదిరించి రామునిభాగమడిగె.

మాడుగుల నాగఫణిశర్మగారికి ఒక అవధానం లో ఇచ్చినసమస్య , భరతుడెదిరించి రామునిభాగమడిగె.

ఆసక్తికరమైన సమస్య, దీనిని వారు పూరించిన పద్ధతి చూడండి.

అకట కష్టాల కడలి నీకొకనికేనా
సుఖసముద్రముదేల సఖులె అంత
నన్నుమరచితివేమి రామన్న అనుచు
భరతుడెదిరించి రాముని భాగమడిగె.

నాకు ఎంతో ఇష్టమైన పద్యాలలో ఇది ఒకటి.

October 20, 2023 / subramanyam

తాలిబాన్ యుద్ధ వ్యూహం ఆఫ్ఘనిస్తాన్‌లో US సైన్యాన్ని ఎలా ఓడించింది?

కోరాలో అడిగిన ఈ ప్రశ్నకు నా జవాబు.

ఆఫ్ఘనిస్తాన్ పైన నేను కొంత పరిశోధన చేసి ఉన్నాను. నేను చెప్పే సమాధానం ప్రధానంగా ఘోస్ట్ వార్స్ మరియు డైరక్టరేట్ ఎస్ అనే పుస్తకాలాలో చెప్పబడిన విషయాలు మరియు సిద్ధాంతాల పైన ఆధారపడిఉన్నది.

కొంచెం పెద్ద సమాధానం అవుతుందేమో కొంచెం ఓపికగా చదవవలసిందిగా మనవి. సమయం లేకపోతే కెవలం తాలిబాన్ వ్యూహాలు అన్న భాగం చదువగలరు .

1. తాలిబాన్‌కు ముందు పరిస్థితులు

1979 లో ఆఫ్ఘనిస్తాన్ లోని కమ్యూనిష్ట్ అనుకూల ప్రభుత్వాన్ని కాపాడడానికి రష్యా తన సేనలని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ లోని మతగురువులు కమ్యూనిష్ట్లు తమ మతాన్ని నాశనం చేస్తున్నందుకు తిరగబడాలని పిలుపునిచ్చిఉన్నారు. ప్రజలు ప్రభుత్వ అనుకూల వర్గం మరియు ప్రభుత్వ వ్యతిరేక వర్గం గా చీలిపోయారు. మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ విధానాలు రుచించకపోవడం వలన ముజాహిదీన్ తిరుగుబాటు ప్రారంభమయ్యింది.

ఇక్కడ ఎవరు మంచి – ఎవరు చెడు అనేది ఒక పెద్ద చర్చ. అది వేరే చర్చ కావున దాని జోలికి నెను వెళ్ళడం లేదు.

ఇక్కడ పోరాటంలో మతం పాత్ర చాల ఎక్కువ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే తాలిబాన్ మనకు అర్థం అవుతుంది.

అమెరికా, సౌదీ అరేబియా పాకిస్తాన్ ద్వారా ముజాహిదీన్ కు సాయం చెసాయి. అధునాతన ఆయుధాలు,ఇబ్బడిముబ్బడి గా ధనం సమకూర్చాయి. పాకిస్తాన్ అమెరికా సౌదీ ల నుండి సాయం తీసుకొని ఆ డబ్బు తన దేశం లో వాడుకుంది. కొంత ధనం తో మిలిటెంట్ స్థావరాలు ఏర్పాటు చేసి ముజాహిదీన్‌కు శిక్షణ ఇచ్చింది. కొంత ధనం తన అవసరాలకు వాడుకుంది.

బుర్హనుద్దీన్ రబ్బానీ, గుల్బుద్దీన్ హెక్మాత్యర్, అహ్మద్ షాహ్ మసూద్, హెరాత్ ప్రావిన్స్ లో అలీ ఖాన్ వంటి వారు తమ తమ స్వంత ముజాహిదీన్ దళాలతో యుద్ధం చేసారు.

1989 లో రష్యా తన సేనలను ఉపహరించుకుంది. ముజీబుల్లా నేతృత్వం లో కమ్యూనిష్ట్-సోషలిస్ట్ భావజాలాలు ఉన్న ప్రభుత్వం 1992 వరకూ పాలించగలిగింది.

తరువాత ఈ బుర్హనుద్దీన్ రబ్బానీ, గుల్బుద్దీన్ హెక్మాత్యర్, అహ్మద్ షాహ్ మసూద్ మరియు మిగత ముజాహిదీన్ నేతలు ఒకరి తో ఒకర గొడవ పడసాగారు.

1992 లో బుర్హనుద్దిన్ మరియు మసూద్ కలిసి ప్రభుత్వన్ని ఏర్పాతు చేసారు, అందులొ హమీద్ కర్జాయి ఒక మంత్రి గా పని చేసారు.

గుల్బుద్దిన్ వీరితో పోరాడసాగాడు.

కొత్తగా వచ్చిన ఈ ముజాహిదీన్ నేతలకు పెద్దగా పరిపాలన రాదు, జాతీయ స్థాయి లో నేతలకే పరిపాలన కష్టం ఐతే, మనం ప్రావిన్స్ (రాష్ట్ర) స్థాయి మరియు పట్టణ స్థాయి నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర స్థాయి మరియు పట్టణ స్థాయి నాయకులలో అవినీతి భారీస్థాయి లో పెరిగిపోయింది. పాలన పై పట్టు లేకపోవడం వలన ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు. కనీసం త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సదుపాయలు కుడా ఇవ్వలేక పోయారు.

2. తాలిబాన్ ఉద్యమ జననం — తొలినాళ్ళు

కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు కనీసం శాంతి భద్రతలైనా కాపాడాయా అంటే లేదు. అప్పటికి 15 ఏళ్ళ గా యుద్ధం జరగడం వలన ప్రజలలో ఎక్కువ మంది వద్ద ఆయుధాలు ఉన్నాయి. దీనితో బలమున్నవాడు బలహీనుడిని ఆయుధం తో బెదిరించి పనిచేయించుకునే వాడు. గ్రామీణ ప్రాంతాలలో స్త్రీల మన ప్రాణాలకు రక్షణ కొరవడింది.

Burhanuddin Rabbani and Ahmadshah Masood

ఈ సమయం లో సమాజం మళ్ళి తమ మతాధికారుల వైపు చూసింది. తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాందహార్ వంటి ప్రాంతాలలో తిరుగుబాటు చేసారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలు వారి వశమయ్యాయి. 7-8 వ శతాబ్దాల ఇస్లామిక్ చట్టాలతో (షరియా) పాలన ప్రారంభించారు.

1994-95 లో వీరి పాలన అందరికీ నచ్చింది, వీరు అవినీతి రహిత పాలన అందిస్తున్నారు అనే ఒక అంశం ప్రజలకి నచ్చింది. వీరు షరియా పేరిట అమానుష కార్యాలో చేశారో లేదో బయట ప్రపంచానికి తెలియదు.

వీరు అందరికంటే మంచిగా, పరిశుద్ధంగా ఇస్లామ్ని పాటిస్తున్నారనే ప్రచారం ప్రారంభమయ్యింది. ఎక్కువ మంది చేరారు, (సహజం గా అక్షరాస్యత ఆఫ్ఘనిస్తాన్ గ్రామామలలో తక్కువ, పెద్ద సంఖ్య లో గ్రామీణ యువకులు వీరి పట్ల ఆకర్షితులయ్యారు). తాలిబ్ అంటె విధ్యార్థి, తాలిబన్ అంటె విద్యార్థి సమూహం అనే అర్థం ఉంది.

పాకిస్తాని ప్రధాని బెనజీర్ భుట్టో ఈ ఉద్యమాన్ని గుర్తించారు. రబ్బానీ – మసూద్ల ప్రభుత్వం తన మాట వినడం లేదు కాబట్టి తాలిబాన్ కు మద్దత్తు ఇచ్చి వారిని అధికారం లోకి తెస్తే తమ మాటకు తలూపే ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉంచవచ్చనుకున్నారు.

పాకిస్తానీలు తాలిబన్‌కు ఆయుధాలు ఇచ్చారు, సైనిక శిక్షణ ఇచ్చారు, ధనం ఇచ్చారు, యుద్ధ వ్యూహాలు తెలిసిన అధికారులను సివిల్ దుస్తులలో తాలిబన్లతో కలిసి రబ్బానీ-మసూద్ లకు వ్యతిరేకం గా పోరాడమని పంపారు.

1996 లో కాబూల్ తాలిబన్ల హస్తగతమయ్యాక వారి కౄరత్వం ప్రపంచానికి తెలిసింది. మహిళలపై వారి కర్కశత్వం చూసి ప్రపంచం కంపించింది. అప్పట్లో కాబూల్ లో కనీసం 50 వేలమంది వితంతువులు ఉండే వారట, భర్త లేదా మరొక పురుష బంధువు (మేల్ రిలెటివ్) లేకపోతే వారిని ఇంటి బయటకు రానిచ్చే ది కాదు తాలిబాన్ యొక్క మత పోలిస్. ఆ మహిళలు ఘోరమైన బాధలు అనుభవించారు. పురుషుల గడ్డాలు ఎంత పొడుగు ఉండాలో దగ్గర నుండి జీవితం లో అన్నిటినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసారు. వీరి మతాభిమానం ఎంత అంటే వీరి అధినేత ముల్లా ఒమర్ ముస్లిమేతరులను కలిసేవాడు కాదు.

వీరి హయాం లో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ్ ఉగ్రవాద కేంద్రమయ్యింది, 9/11 తో పాటు అనేక దాడులు జరిగాయి. 2001లో వీరిపై అమెరికా దాడులు చేసినప్పుడు కేవలం 6-7 వారాలలో వీరు మొత్తం ఓటమి పాలయ్యారు. ఇక్కడ పాకిస్తాన్ వారిని తమ భూభాగం లోనికి రానిచ్చింది. అమెరికాకు అనుకూలం అంటూనే తాలిబన్ నాయకత్వాన్ని రక్షించింది . ముల్లా ఒమర్, ఒసామ బిన్ లాడెన్ లు పాకిస్తాన్ లోనే మరణించారు.

3. తాలిబాన్ వ్యూహం

2001 లో తాలిబాన్ ఆఫ్ఘన్ సరిహద్దుల నుండి తరిమేసాక అమెరికా తాము అద్భుత విజయాన్ని సాధించామనుకుంది. శత్రు శేషం లేకుండా చేయాల్సింది పోయి అఫ్ఘానిస్తాన్ లో తన ద్వితీయ శ్రేణి మిలిటరీ గూఢచర్య నాయకత్వాలను పెట్టి , ప్రధాన వనరులను ఇరాక్ యుద్ధానికి తరలించింది.

2003 -2004 మధ్య అమెరికా ఇరాక్ యుద్ధం లో తలమునకై ఉండి అఫ్ఘాన్ కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఈ సమయం లో పాకిస్తాన్ లోని ఫెడెరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ (ఫాటా) లో తాలిబన్లు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు.

ఒక పక్క యుద్ధానికి సాయం చేస్తున్నామని చెప్తూ అమెరికా వద్దనుండి ధనం ఆయుధాలు పొందుతూనే మరొకపక్క తాలిబన్లకు సురక్షిత స్థిర నివాసాలు ఏర్పాటు చేసింది పాకిస్తాన్.

2003-04 లో తాలిబన్లు అఫ్ఘాన్ యుద్ధం ముగిద్దామని, తమపై కేసులు ఎత్తేస్తే తాము వచ్చి దేశ పునర్నిర్మాణం లో పాలుపంచుకుంటామని హమీద్ కర్జాయి నేత్రుత్వం లోని ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరారు.

దీనికి హమీద్ కర్జాయిసానుకూలంగాస్పందిచారు, అయితే పాకిస్తానీ మిలిటరీ దీనికి సానుకూలత వ్యక్తం చేయ్లదు. పాకిస్తాన్ ను గుడ్డిగా నమ్మిన అమెరికన్ అధికారులు కూడా దీనిని సమర్ధించలేదు. ముందు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు కనబడి, సరెండర్ అయిన తాలిబాన్ కమాండర్లను గ్వాంటానమో బే కు తరలించారు అమెరికన్ అధికారులు.

ఇది తాలిబాన్‌లకు, హమీద్ కర్జై కి కోపం తెప్పించింది. అంతే కాదు తాలిబాన్లు ఇహ కర్జాఇ ని నమ్మకూడదు అని నిశ్చయించుకున్నారు.

2005 నాటికి అమెరికా బలగాలు నాటో బలగాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి మద్దత్తు గా ఉన్నాయి. ఈ లోగా పాకిస్తాన్ లో బలం కూడగట్టుకొని తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘన్ భూభాగం లోకి వచ్చి గెరిల్లా యుద్ధాలు మొదలుపెట్టారు.

తమకు భారీగా సైనికులు కావాలి కాబట్టి ఒక పత్రికను ప్రారంభించి అమెరికా తమను దోచుకుంటొందన్న కథనాలను ప్రచురించారు. తరువాత మహిళా సాధికారత పేరుతో ఇస్లాం ను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు మొదలుపెట్టారు.

1970 ల నుండీ ఇస్లాం పేరిట యుద్ధాలు ఆఫ్ఘన్లకు అలవాటే , కావున మొదట ఈ ప్రచారానికి పెద్ద మద్దత్తు లభించలేదు. కానీ పట్టువదలకుండా ఈ ప్రచారాన్ని చేసింది తాలిబాన్. మరొక పక్క అమెరికన్లు అలాగే ఐరోపా వారు తమ జ్యుడిషియల్ వ్యవస్థను ఆఫ్ఘనిస్తాన్ కు తెచ్చారు. దీనితో ప్రాథమిక కోర్టులు, వాటిపైన హైకోర్టులు సుప్రీం కోర్టులు వచ్చాయి. అప్పీళ్ళపై అప్పీళ్ళు చేసుకునే అధికారం ఉండడం తో సామాన్యునికి న్యాయం సరైన సమయం లో న్యాయం జరగడం తగ్గిపోయింది.

యుద్ధాలతో మగ్గుతున్న దేశం లో ఇది ఆశించకూడని పరిణామం. ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. తాలిబన్లు దీనిని తమకు అనుకూలం గా మలుచుకున్నారు. ఇస్లామి రాజ్యం ఉంటే ఇలా జరిగేదా అంటూ కథనాలు ప్రచురించారు.

మౌల్వీలు, ముల్లాలు అధికసంఖ్యలో తాలిబాన్లను ఆదరించడం మొదలుపెట్టారు, శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రభుత్వ విధానాలను ఎండగట్టేవారు. దీని వలన గ్రామీణ ప్రాంతాలలో తాలిబాన్‌లకు పట్టు దొరకసాగింది.

2006-07 నుండి తాలిబన్లు మళ్ళీ అఫ్ఘాన్ భూమిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. తెర వెనుక పాకిస్తాన్ వీరికి సాయం అందించసాగింది. గ్రామాలలో వీరి మాటకు ఎదురు చెప్పేవారు కరువయ్యారు.

ఇదే సమయం లో అమెరికాకు పాకిస్తాన్ మోసం తెలిసివచ్చింది. కానీ పాక్ భూభాగం ద్వారానే తమ సైనికులకు భోజనం, ఇంధనం అందిస్తున్న అమేరికా పాకిస్తాన్ను వదులుకుంటె ఖచ్చితంగా ఓడి పోతామనే విషయాన్ని గుర్తించి పాక్ తో తెగతెంపులు చేసుకోలేకపోయింది.

తాము మానవ రహిత యుద్ధ విమానాలు (డ్రోన్లు) వాడి ఫాటా లో ఉన్న తాలిబాన్ అగ్రనాయకత్వాన్ని చంపుతామని దానికి అడ్డు పడవద్దని అమెరికా ప్రతిపాదిస్తే సరేనంది పాకిస్తాన్, అయితే అంతకు ముందే అగ్రనాయకత్వాలని క్వెట్టా పట్టణానికి తరలించింది.

అమెరికా అనేక డ్రోన్ దాడులు చేసి చాలామంది తాలిబాన్ ద్వితీయ శ్రేణి నాయకులను చంపింది. మళ్ళి మోసపోయామని అమెరికా గుర్తించినా , అప్పటికే ఆర్థిక మాంద్యం రావడం తో అటు వైపు దృష్టి సారించ వలసిన పరిస్థితి ఏర్పడింది.

బుష్ 2008 లో ఒబామ కు ట్రాన్సిషన్ చేస్తున్నప్పుడు పాక్ ను మాత్రం నమ్మవద్దు అని చెప్పాడంటే అమెరికన్లు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకోవచ్చు. అటు హమీద్ కర్జాయి కూడా పాకిస్తాన్ పై దాడి చేస్తే తప్ప తాలిబాన్ సమస్య కు పరిష్కారం దొరకదని అమెరికాను శతవిధాలా ఒప్పించే ప్రయత్నం చేసారు. అది కొంత మేర సఫలం అవుతూందని ఆయన ఆనందిస్తున్న సమయం లో అమెరికాలో అధికార మార్పిడి జరిగింది.

ఒబామా ఈ యుద్ధాని ఆపుతానని మాట ఇచ్చి ఎన్నికలలో గెలిచారు.

సరే ఈ 2006-08 మధ్య తాలిబాన్ ఏం చేశారు?

చక్కగా తాము గెలిచిన చోట నల్ల మందు సాగు ప్రోత్సహించారు. నల్లమందు మరియు డ్రగ్స్ విరివిగా తయారు చేసి ఎగుమతులు చేయసాగారు. ఆఫ్ఘన్లకు కంచెలతో ఉండే సరిహద్దులు లేకపోవడంవలన ఈ డ్రగ్స్ ను పాకిస్తాన్ ఇరాన్ భూభాగాల ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసి ధనం సంపాదించసాగింది.

ఇలా జిల్లా తరువాత జిల్లా ని గెలుస్తున్న తాలిబన్లు, తమ కర్కశత్వం తో నాటో దళాలను భయ భీతులను చేసారు. అమెరికన్లు ,నాటో దళాలు అన్ని నియమాలకు లోబడి పోరాడాలి , తాలిబాన్ కు ఆ ఇబ్బంది లేదు. ఎక్కడి కక్కడ ల్యాండ్‌మైన్లు పెట్టి అమెరికన్ దళాలను పెల్చేసేవారు, ఒకసారి ఒక ఊరు తమ అధీనం లోకి వస్తే అక్కడికి అమెరికన్ సైనికులు ఇహ రాలేనంతగా దారులను దిగ్బంధించే వారు. అమెరికన్లకు సహాయం చేస్తున్నారని తెలిస్తే చాలు నిర్దాక్షిణ్యం గా చంపేవారు.

ఇలా గ్రామాలు వారి చేతుల్లోకి వచ్చాయి.

Afghan farmers collect raw opium earlier this year in a poppy field in the Khogyani district of Jalalabad, east of Kabul. Afghanistan’s opium production surged in 2013 to record levels, despite 12 years of international efforts to wean the country off the narcotics trade, according to a U.N. report released Wednesday.

ఒబామా యుద్ధం ఆపుతానని మాట ఇచ్చి అధ్యక్షుడయ్యాడు కదా , ఇక్కడ తాలిబన్లు కొత్త ఆట ప్రారంభించారు, తాము అమెరికా తో చర్చలు జరుపుతామన్నారు. అటు పాక్ ను ఇటు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కాదాని నేరుగా తమతోనే చర్చించాలని షరతు పెట్టారు.

ఒబామా ప్రభుత్వం రహస్యం గా చర్చలు మొదలుపెట్టింది. తమకు ఖత్తర్ లో కార్యాలయం కావాలని అక్కడనుండి చర్చలు జరుపుతామని తాలిబన్లు చెప్పరు. అంతగా అనుభవం లెని ఒబామ ప్రభుత్వం దీనికి ఒప్పుకొని హమీద్ కర్జాయి అతని అభిప్రాయం అడిగింది. తాను ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిని కావున తాలిబాన్ తమని తాము ఒక పార్టీ గా మాత్రమే పేర్కొనాలని, దేస ప్రతినిధులుగా చెప్పుకోకూడదని కర్జాయి షరతు విధించారు.

దీనికి ఒప్పుకుంటున్నామని చెప్పిన తాలిబాన్ మొదటి రోజే (భవనం ప్రారంభించిన రోజే) దీనిని తుంగలో తొక్కింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని గోడలపై వ్రాసింది.

అమెరికా ఒప్పుకోవడం తో నె ఇలా తాలిబాన్ చేసిందనుకోని కర్జాయి ఒబామా ను నమ్మడం మానేసాడు. తమను సంప్రదించకుండా ఈ పని చేసారని పాకిస్తాన్ సహాయ నిరాకరణకు దిగింది. తాలిబాన్ ఒక్క దెబ్బతో అమెరికా మిత్రులని అమెరికాకు దూరం చేసింది.

మళ్ళీ అందరినీ ఒప్పించి చర్చలు ప్రారంబించేసరికి అమెరికా తల ప్రాణం తోకకి వచ్చింది.

ఈలోగా తాలిబన్లు అమెరికా తరుపున పోరాడుతున్న అఫ్ఘాన్ సైనికులను ఆకర్షిండం ప్రారంభించారు. ముస్లిమేతరులతో కలిసి ముస్లింలను చంపడం పాపమని నమ్మబలికారు. కొంతమంది సైనికులు తాలిబాన్ వైపు మారడం మొదలు పెట్టరు. తమతో కలుస్తున్న ఆఫ్ఘన్ సైనికులు కనీసం ఒక అమెరికన్ సైనికుడిననినా చంపాకే తమ వద్దకు రావాలని దాని వలన దేవుడు సంతోషిస్తాడని వారిని నమ్మించడం లో తాలిబాన్లు కృతకృత్యులయ్యారు. అమెరికా వద్ద నున్న ఆఫ్ఘన్ సైనికులు తమ అధికారులను చంపి అక్కడనుండి తప్పించుకొని తాలిబన్ వద్ద చేర సాగారు.

అమెరికన్ సేనల మానసిక స్థైర్యం దెబ్బ తినసాగింది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మరాదో తెలియని పరిస్థితి. పెద్దగా దాడి చేస్తే తాలిబన్లు పాకిస్తాన్ పారిపోతున్నారు , కొంచం అలసత్వం వహిస్తే చాలు వచ్చి మీదబడుతున్నారు.

మరొక పక్క అమెరికన్లు ఆఫ్గనిస్తాన్ లో మహిళా సాధికారత కోసం చేసిన ప్రయత్నాలు వారికి ఇబ్బందికరంగా మారాయి, వేల సంవత్సరాలనుండి సంపూర్ణ పురుషాధిక్యతను చూసిన సమాజం , యుద్ధాలలో మరింతగా వెనక్కు వెళ్ళింది. ఒక్కసారిగా ఆ సమాజాన్ని ఒక అమెరికన్ సమాజం లా చేద్దామని అమెరికన్ మహిళా ప్రొఫెసర్లు ప్రయత్నించారు, మీరు ఇళ్ళకు వెళ్ళి మీ తండ్రుల ఆధిక్యతను ప్రశ్నించండి, మీ భర్తలను ప్రశ్నించండి, ఈ విధానాలను ప్రశ్నించండి అని మహిళలకు తర్ఫీదు ఇచ్చారు. ఇది తప్పా-ఒప్పా అన్నది పక్కనపెడితే, ఆ సమాజం ఈ మార్పుకు సిద్ధంగాలేదన్నమాట వాస్తవం.

ఇది గుర్తించిన తాలిబాన్ మన మహిళలను మనకు కాకుండా చేస్తున్నారు అని ప్రచారం మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంతాలలో దీనిని చాలామంది నమ్మారు.

ఈ మహిళల స్కూళ్ళ వద్ద కాలేజీ ల వద్ద రక్షణగా ఉన్న సైనికులని టార్గెట్ చేసింది తాలిబాన్, అక్కడ సైనికులు మరణించ సాగారు. తమ మ్రుతుల సంఖ్య ను తగ్గించుకోవాలనుకునారో ఎమో ఇక్కడ ఆఫ్ఘన్ సైనికులను అధికంగా పెట్ట సాగారు అమెరికన్లు. కొన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉన్న, తాలిబాన్లు దాడులు చేస్తూనే ఉండడం తో ఈ ఆడపిల్ల చదువు కోసం నా ప్రాణాలు పణం గా పెట్టాలా అన్న ఆలోచన మొదలై నెమ్మదిగా ఆఫ్ఘన్ సైనికులు అయోమయం లో పడారు. కొందరు తాలిబన్ లలోకి వెళ్ళి చేరారు, కొందరు కర్తవ్య పాలనలో ఆత్మార్పణ చేశారు, కొందరు ఉద్యోగాలు వదిలేసారు.

ట్రంప్ అధ్యక్షుడయ్యాక పాక్ లోని స్థావరాలను ధ్వంసం చేయకుండా ఈ యుద్ధం గెలవలేమని అర్థమయ్యింది. చర్చలను వేగవంతం చేసి అఫ్ఘాన్ దళాల ట్రైనింగ్ వేగవంతం చేసి బయటకు వెళ్ళాలని నిశ్చయించారు , ఈ పని బైడెన్ హయాం లో పూర్త్యయ్యింది.

Taliban takeover the Afghan Governmment

మతాన్ని వాడడం ద్వార ప్రజలను తమవైపు తిప్పుకోవడం, మత ప్రాతిపదికన పాకిస్తాన్ లో రక్షణ పొందడం, అయోమయాన్ని సృష్టించడం, డ్రగ్స్ ద్వారా నిధులు సమకూర్చుకోవడం, ప్రత్యర్థి యొక్క వ్యవస్థ లో బలహీనతలను బాగా వాడుకోవడం, సమాజం లో ఒక వర్గాన్ని (పురుషులను) తమవైపు తిప్పుకోవడం. ఇవి తాలిబన్లు వాడిన వ్యూహాలు. ఇందులో చాల వరకు ఆక్షేపణీయమైనవే .

పెద్ద సమాధానాన్ని సమయం తీసుకు చదివినందుకు ధన్యవాదాలు.

October 2, 2023 / subramanyam

Calling Sehmat : My Take

Bharat and Pakistan are two nations with a shared past and a troubled present. Pakistan’s obsession with Kashmir and its wars with India, i.e., Bharat, are well known. The conflicts and the wars took a toll on the resources of both countries and continue to take a toll on the populations. 

This is more true for the people in the region of conflict. Now, what if one of the persons in the conflict zone sees through the lies of one party, which strengthens his love for this motherland, and he gives his all to protect the tricolor he loves the most? That’s Hidayat Khan, a resident of Srinagar in Jammu and Kashmir, who loved the nation so much that he helped India with vital information from Pakistan, thanks to his vast business network there. 

It was 1970, and India knew that its western neighbor was getting ready for an attack; Hidayat Khan knew this too; his health was failing, and he needed someone to take over the business in Pakistan and help Bharat. The search for a trusted soul brings him to his only daughter, Sahmat. This happy girl who was head over heels in love with a college sweetheart has to pick the mantle and move to Pakistan suddenly; how did she handle this? What was the adventure? What effect did this have on her life? How close was she to death? You will have to read Shri Harinder Sikka’s captivating book “Calling Sehmat” to get your answers. Here is the blurb of the book that captivated me. 

The year is 1971

Tension is brewing between India and Pakistan

One secret could change the course of history . . .

It’s now up to her

When a young college-going Kashmiri girl, Sehmat, gets to know her dying father’s last wish, she can do little but surrender to his passion and patriotism and follow the path he has so painstakingly laid out. It is the beginning of her transformation from an ordinary girl into a deadly spy.

She’s then married off to the son of a well-connected Pakistani general, and her mission is to regularly pass information to the Indian intelligence. Something she does with extreme courage and bravado, till she stumbles on information that could destroy the naval might of her beloved country.

Inspired from real events, Calling Sehmat . . . is an espionage thriller that brings to life the story of this unsung heroine of war

What did I like in the book. 

The research of the author. The book is inspired on true events and author has done his homework perfectly. 

The way the author introduces each of the characters, once a character is introduced, we know the characteristics, the attributes, the mannerisms, and all about that character. This was amazing as far as I was concerned. 

The pace of the book, the book is a page-turner and will leave us asking for more. 

The role of Indian agencies: I loved the way the agencies took care of Sehmat. This was not shown in the Bollywood movie, but the book tells us about the care taken by Indian agencies. 

The author speaks about Naval warfare at the end of the book and tells us about incidents in the 1971 Indo -Pak war. That part can’t be missed. 

What could have been improved : 

To be honest, I did not find anything that could have been improved. The book was perfect in many ways. 

Actually, I felt sad for the Syeds, too, who lost a lot because they trusted a member who joined their family. However, we ought to understand that this was a time of war, and if they were not harmed, a nation on the other side would be harmed. 

To conclude 

Do read the book when you get time, must-read work to understand the sacrifices that were made to make the tricolor fly high in full majesty and glory. 

October 2, 2023 / subramanyam

విమర్శ (సినీ /రాజకీయ) ఎలా ఉండాలి?

కోరాలో అడిగిన ఈ ప్రశ్నకు నా జవాబు.

విమర్శ అంటే కేవలం ఏ విషయం బాగోలేదో ఎత్తి చూపే వ్యాఖ్య మాత్రమే కాకూడదు అనేది నా అభిప్రాయం. ఒక సినిమా కానీ, రాజకీయ నిర్ణయం కానీ, ప్రభుత్వ పనితీరు కానీ ఏదైనా సరే ఒకవిశ్లేషకునిగా విమర్శ వ్రాశినా లేక, చెప్పినా అక్కడ ఉన్న మంచీ – చెడు రెండు పార్శ్వాలనూ స్పృశించాలి.

ఒక విమర్శకునిగా మన లక్ష్యం ఏమి ? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ?

నా వరకు నేను విమర్శ అనేది మన విజ్ఞాన ప్రదర్శన గా ఉండరాదు, అలాగే మన భావజాల వ్యాప్తి కోసం విమర్శను వాడుకోకూడదు.

విమర్శ యొక్క ప్రథమ లక్ష్యం సదరు వ్యక్తిని కించపరచడం కాదు, వారు చేసిన పని ఎలా ఉంది , మరొక సారి వారు ఇటువంటి పనులు మళ్ళీ చేసినప్పుడు వారి వెటిని కొనసాగించాలి, వేటిని వదిలిపెట్టాలి/ఆపివేయాలి,మనని ఏ విషయాలు మెప్పించాయి, మనని ఏ విషయాలు బాధపెట్టాయి.

క్లుప్తం గా చెప్పలంటే వారి తదుపరి సినిమా కానీ, తదుపరి రాజకీయనిర్ణయం గాని,తదుపరి ప్రభుత్వనిర్ణయం కానీ ఇంకా గొప్పగా, ఇంకా చక్కగా ఉండాలి అనే ఒక్క బిందువు మాత్రమే విమర్శకుని లక్ష్యం కావాలి.

ఏ విమర్శనైనా ప్రారంభించేటప్పుడు ఆ మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఏమిటోచెప్తూ ప్రారంభించండి. ఉదాహరణకు ఒక సినిమా పైన మీరు విమర్శ వ్రాస్తే ఆ సినిమాలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన / లేదా మీ పై ప్రభావం చూపిన అంశం/సన్నివేశం/ సంభాషణ ఏదో దానితో ప్రారంభించండి. సాధ్యమైనతవరకూ (కనీసం 90% ) ఇది ఒక పాజిటివ్ పాయింట్ అయ్యేలా చూసుకోండి.

తరువాత మీకు ఆసినిమాలో, లేదా రాజకీయ నిర్ణయంలో లేదా ప్రభుత్వ పథకంలో ఉన్న మంచి విషయాలను ప్రస్తావించండి .

పిమ్మట మీకు కనబడుతున్న చెడు విషయాలు, లేక తప్పులు గురుంచి వ్రాయండి. ఆ తప్పులను సరిచేసుకోవడం ఎలా అనేవిషయం పైన మీకున్న అవగాహన మేర సూచనలు చేయండి.

చివరగా (చివరి పేరాలో) మీకు కనబడ్డమంచి విషయాలను స్పృసిస్తూ,(అన్నిటినీ ఏకరువు పెట్టోద్దు) వాతిని కొన్సాగిస్తూనే లోపాలను అధిగమిస్తే తరువాతి రోజులల్లో ఆ వ్యక్తులు తీసే సినిమాలు గాని, రాజకీయ నిర్ణయాలు కానీ, ప్రభుత్వ నిర్ణయాలు కానీ చాలా బాగుంటాయని, వాటి కోసం ఎదురుచూస్తున్నానని తెలియజేస్తూ ముగించండి.

చివరగా

మీరు ఒక విమర్శకుడనని,న్యాయమూర్తిని కానని గుర్తుంచుకోండి. కావున ప్రతీ వాక్యం ఇదిద్ మంచి ఇదితాపు అని తీర్పులు ఇవ్వకుండా ,నా అభిప్రాయం లో ఇది మంచి, లేక నా అభిప్రాయం లో ఇది బాలేదు అని చెప్పే ప్రయత్నం చేయండి. మన అభిప్రాయం కూడా తప్పు అవ్వొచ్చు కదా, మనం ఒక విషయం పైన తీర్పు ఇస్తున్నట్టు వ్రాస్తే అది తప్పు ఐతే దానినిచదివి నమ్మినవారు ఇబ్బంది పడతారు. నా అభిప్రాయం అని వ్రాస్తే, పాఠకులు అలాగే సినిమా వారు ,,రాజకీయం వారు దానిని ఒక అభిప్రాయంగా మాత్రమే చూసి స్వీకరించాలోవద్దో నిర్ణయించుకుంటారు.

ఈ సమాధానం మీకు ఉపకరిస్తుందని ఆశిస్తూ సెలవు .

September 22, 2023 / subramanyam

భారత్ కెనడా ల మధ్య ప్రస్తుతం ఏర్పడుతున్న ఈ వైరుద్యాలకు కారణాలు ఏమిటి? దౌత్య పరంగా అత్యుత్తమ సమయం నడుస్తున్న సమయంలో భారత్ యొక్క ఈ ప్రతిఘటన భవిష్యత్తు లో ఎలాంటి ప్రభావాలు చూపనుంది?

కోరా లో అడగబడిన ఈ ప్రశ్నకు నా జవాబు.

కెనడా పై భారత్ బలమైన స్వరం వినిపించడం మంచిది అని నా అభిప్రాయాం. ఈ విషయం లో భారత్ తన అడుగులు బాగా యోచించి వేస్తోందని అర్థం అవుతోంది.

వైరుధ్యాలు పెరుగుటకు కారణం

1. 1980 ల నుండే కెనడా లో ఖలిస్తానీ వేర్పాటు వాదులు తమ పనులలో వేగం పెంచారు.

2. ఇప్పుడున్న ప్రధాని తండ్రి గారు అప్పట్లో ప్రధానిగా ఉన్నారు. వారిని ఎన్నో సార్లు నటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి గారు ఈ వేర్పాటువాదుల పై ఉక్కుపాదాం మోపాలి అని కోరారు. కానీ వాటిని ఆయన పెడచెవిన పెట్టారు.

3. 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం, కెనడా లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది తల్విందర్ సింగ్ పర్మార్ ను భారత దేశానికి అప్పగించవల్సినది గా కోరింది. దీనిని పియర్ ట్రుడో (ప్రస్తుత కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో గారి తండ్రి గారు) గారి ప్రభుత్వం తిరస్కరించింది.

4. ఈ తల్విందర్ సింగ్ పర్మార్ భారత దేశం లో ఉన్న పోలిస్ అధికారుల హత్యల కేసులలో నిందితుడు.

5. ఈ తల్విందర్ సింగ్ పర్మార్ తరువాత రోజులలో బబ్బర్ ఖల్సా అనే సంస్థనుకు అధినాయకుడై 1985 లో కనిష్క అనే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చడం లో ప్రముఖ పాత్ర పోషించాడు.

6. భూమి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఈ విమనం పేలింది , మొత్తం 329 మంది ప్రయాణికులు మరణించారు.

7. ఆ తరువాత వచ్చిన కెనేడియన్ ప్రభుత్వాలు కాస్త ఈ ఉగ్రవాదూలను కట్టడి చేసాయి.

8. కన్సర్వేటివ్ పార్టీ కాసత వీరికి వ్యతిరేకం గా కనిపిస్తుంది.

9. 2015 లో జస్టిన్ ట్రుడో లిబరల్ పార్టీ తర్పున అధికారం లోకి వచ్చాక ఆయన కహ్లిస్తానీల పైన చూసీ చూడని వైఖరి అవలంబించసాగాడు.

10. 2020 ఎన్నికలలో లిబరల్ పార్టీ మెజారిటీ తగ్గి ఆయన , జగ్మీత్ సింగ్ యొక్క పార్టీ మద్దత్తు తీసుకోవలసి వచ్చింది.

11. జగ్మీత్ సింగ్ బాహటం గానే ఖలిస్తానీల సానుభూతిపరుడిగా తనని తాను అభివర్ణించుకుంటాదు.

12. ఇక అప్పడినుండి జస్టిన్ ట్రుడో ప్రత్యక్షం గా ఖలిస్తానీలకు మద్దత్తు ఇవ్వడం ప్రారంభించాడు.

13. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు ఒక ఖలిస్తానీ ని వెంట బెట్టుకు రావడం వలన అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆయనను కలవడానికి నిరాకరించారు.

14. భారత దేశం లో రైతుల ఆందోళనలకు మద్దత్తు అంటూ ఇక్కడ ఉన్న ఖలిస్తానీలకు సహాయం చేశాడని కొన్ని ఆరోపణలు ఉన్నాయి.

15. కొద్ది రోజుల క్రితం కెనడా లో ఖలిస్తానీ రెఫరెండం కు షకరించాడౌ.

16. ఇందిరా గాంధీ ని సిక్కులు చంపుతున్నట్టు ఒక శకటాన్ని తయారు చేసి కెనడా లో తిప్పినా, ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకునాడు.

17. హిందువుల మందిరాలపైన దాడులు, భారత రాయబార కార్యాలపైన దాడులు జరిగిన ప్రభుత్వం కేవలం ఖండనలకు పరిమితమీంద్ కాని గట్టి చర్యలు చేపట్టలేదు అనేది నిర్వివాదాంశం.

18. ఇప్పుడు ఒక ఖలిస్తానీ ఉగ్రవాది మరణిస్తే సరైన సాక్స్యాలు లేకుందానే ఇదిద్ భారత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.

19. తరువాత భారత్ కు చెందిన ఒక దౌత్యవేత్తను వెనక్కి పంపారు. ఆయన పేరును బయటికి చెప్పారు, ఇది అంతర్జాతీయ కట్టుబాట్లకు విరుద్ధం.

20 నిన్న గురుపత్వంత్ సింగ్ పన్ను అనే ఖలిస్తానీ హిందువులందరూ కెనడాని వదిలి వెళ్ళాలని ధైర్యంగా పబ్లిక్ లో చెప్పగలిగాడంటే ఆ ప్రభుత్వం వోట్ల కోసం ఖలిస్తానీలకు ఎంత దాసోహం అయ్యింది తెలుస్తోది.

భవిష్యత్తు పై ప్రభావం

భారత్ ఎప్పటికప్పుడు పై విషయాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతోంది, అలాగే ఆధారాలు కూడా చూపుతోంది. అందుకే అమెరికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియాలు భారత్ పై జస్టిన్ ట్రుడో యొక్క వాదాన్ని సమర్థించలేదు.

భారత్ ఇప్పుడు దూకుడు పెంచి ఖలిస్తానీలను ఏరివేయాలని , తమపై నిరాధార ఆరోపణలు చేయరాదని జస్టిన్ ట్రుడో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతోంది , అందుకె మొదటీ రోజు జస్టిన్ ట్రుడో గారు చూపిన దూకుడు రెండవనాటికి మాయం అయ్యింది.

కావున ప్రస్తుతానికి భారత్ సరైన దిశలోనే ఒత్తిడి పెంచుతూ దూకుడుగా వెళుతోందని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ప్రపంచదేశాలు ఎదుర్కుంటున్న పెద్ద సమస్య ఉగ్రవాదం, ఖలిస్తానీలు ఉగ్రవాదులు అనే విషయం భారత్ పదే పదే అంతర్జాతీయ వేదికలపైన చెప్తోంది , కావున ఈ విషయం లో భారత్ ని ప్రపంచం తప్పుబట్టలేదు.

ఇక వాణిజ్య విషయాలకు వస్తే కెనడా భారత్ లా ఎగుమతి -దిగుమతులు దాదాపు సమానం. అస్టిన్ ట్రుడో ప్రభుత్వం మనతో వాణిజ్యాన్ని ఆపడం మూర్ఖ్త్వం అవుతుంది, కావున వారు ఆ పని చేస్తారని నేను అనుకోవడం లేదు.

కెనడా లో జస్టిన్ ట్రుడో ప్రభుత్వం యొక్క పాపులారిటీ నానాటికి పడిపోతోంది , మళ్ళీ కన్సర్వేటివ్ లో అధికారంలోకి రావొచ్చని అన్ని సంస్థలూ చెప్తున్నా యి, వారు అధికారం లోకి వస్తే వారు కెనడాలోని ఖలిస్తానీలను అదుపు చేసి భారత్ తో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.