Skip to content
December 7, 2013 / subramanyam

ఆంధ్రనగరి :: పుస్తక సమీక్ష


ఆంధ్ర ప్రజలకి చరిత్ర అంటే అవగాహన తక్కువ
 
ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచమంతా తమతమ చారిత్రక సాంస్కృతిక విషయాలు అందరికీ తెలిసేవిధంగా చెప్పడం ఒక ఉద్యమరూపంలో చేస్తుంటే మనవాళ్ళలో…..   ప్రపంచమంతా ప్రాముఖ్యం కలిగిన అమరావతి శిల్పశైలి గురించి చాల కొద్దిమందికి తెలుసు. దీనికి ముఖ్య కారణం మన విద్యావ్యవస్థే. నాలుగున్నర శతాబ్దాలు అవిచ్చిన్నంగా సగానికి పైగా భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల గురించి చరిత్ర పాట్యపుస్తకాల్లో ఒక పేజికి మించి ఉండదు. అదే ఢిల్లీలో వందేళ్ళు కూడా నిలవని వంశాలపై పూర్తి పాటాలే ఉంటాయి.
 
పాశ్చ్యాత దేశాల్లోలా చారిత్రాత్మక నవలారచన తెలుగులో చాలా తక్కువ. కధ కల్పితమే అయినా చారిత్రక వాస్తవానికి దగ్గరగా రాయాలంటే ఎంతో పరిశీలన అవసరం. అది ఖర్చుతో కూడుకొన్న పని. ప్రతిఫలం తక్కువ. దానితో ఎంతో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఈ నేపధ్యంలో మారుతున్న అలవాట్లనూ, అభిరుచులను మనసులో పెట్టుకొని చరిత్ర పై పాటకుల ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే…..
 
ఇది, క్రీ.పూ. మూడవ శతాబ్దంలో కృష్ణా నదీమతల్లి ఒడిలో వికసించిన ఒక వెయ్యేళ్ళు ఆసియా మారుమూలలకి నాగరికతని పంచిన అమరావతి కధ.  

పుస్తకం వెనుక ఉన్న ఈ పరిచయ వాక్యాలు నన్ను మొదట కట్టి పడేసాయి. నిజమే కదా మనం చరిత్ర గురించి నిజంగా చాలా తక్కువ చదువుతున్నాం, సరే ఈ పుస్తకం లో సాయి గారు ఏం చెప్తారో చూద్దాం అనే కుతూహలం తో ఆంధ్రనగరి పుస్తకం తీసుకున్నాను.

సరే,ఇహ పుస్తక సమీక్ష విషయానికి వద్దాం. తెలుగువారికి తలమానికమైన నగరం అమరావతి, కొన్ని వేల ఏళ్ళ క్రితం నిర్మితమై, తొలి తెలుగు సామ్రాట్టుల ఆదరాభిమానాలకు పాత్రురాలై బౌధ్ధ వైదిక ధర్మాలకు ఆలవాలమై వెలిగిన నగరం. ఆ నగరము యొక్క కథను, తొలి తెలుగు ప్రభువులైన శాతవాహనుల యొక్క కథను తనదైన శైలి లో చెప్పె ప్రయత్నం రచయిత గారు చేసారు.  కల్పిత కథ ఏ ఐనా చరిత్ర ను చెప్పడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం.

 అసలు మొదటి ఆంధ్ర సామ్రాజ్యం ఎప్పుడు ఎందుకు ఏర్పాటు చేయవలసింది వచ్చింది అనే ఇతివృత్తంతో ఈ కథ ప్రారంభమవుతుంది. అశోకుని పరిపాలనలో మౌర్యసామ్రజ్యం తన సర్వోత్తమ స్థితిలో ఉన్న సమయంలో ఆయన కళింగ దేశం పైన దండెత్తడం, దానికి సామంత రాజులైన తెలుగు ప్రభువులను సైన్యాన్ని తీసుకురమ్మని చెప్పడం జరుగుతాయి. ఐతే దీనికి ఆంధ్ర ప్రభువులు ఎలా స్పందించారు? వారికి కళింగ దేశాధిపతులతో ఎటువంటి సంబంధబాంధవ్యాలు ఉన్నాయి, అవి ఎటువంటి పరిణమాలకు దారి తీసాయి? ఈ పరిణామాలు శాతవాహన శకానికి నాందీప్రస్తావనగా ఎలా నిలుస్తాయి, నాటి వ్యూహ ప్రతివ్యూహములు ఏమిటి? వీటికి, అమరావతీ నగరమునకు గల సంబంధమేమిటి అనే విషయాలతో కథ సాగుతుంది. 

తరువాత మనం శాతవాహన రాజులలో ఉత్క్రుష్టుడిగా కీర్తింప బడే గౌతమీపుత్ర శాతకర్ణి వారి కాలనికి వెళ్ళి ఆ సమయంలో ఆంధ్ర సామ్రాజ్యం యొక్క గొప్ప తనాన్ని చూస్తాం , తరువాత కుబ్జ విష్ణువర్ధనుని కాలంలో సామ్రాజ్యపతనాన్ని,ఈ రాజ్యం కాంచీపుర రాజ్యం లో కలవడాన్ని చూస్తాము. ఈ సమయాలలో అమరావతీ నగర ప్రాభవాన్ని కూడా మనం చూడగలుగుతాము.

కల్పనే ఐనా చక్కగా చెప్పబడిన కథ, పాఠకులను కట్టిపడేసే శైలి అభినందించవలసిన విషయములు. చరిత్ర లో మనకి తెలియని విషయములు మనకి తెలుస్తాయి. చైనీయులు సైతం తెలుగును అభినందిచారని తెలుసుకోవడం ఆనందదాయకం కదా.

ఇక నాకు నచ్చని విషయాలు గూర్చి ప్రస్తావించాల్సి వస్తే, ప్రతీ కథ (శ్రీముఖశాతవాహనుడు, గౌతమీ పుత్రుల వారిది, పులికేశిని, కుబ్జ విష్ణువర్ధనుని ఓడించేది) పూర్తిగా చెప్పబడినట్లు నాకె అనిపించలేదు. చివరిది చాలవరకు బాగున్నప్పటికీ మిగతా రెండిటిలో మాత్రం మనం తెలుసుకోవలసినదేదో తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మరొకటి కొన్ని కొన్ని చోట్ల వైదిక మతంకంటే బౌధ్ధం గొప్పదని చెప్పడానికి ప్రయత్నించారేమో అనిపిస్తుంది. అయితే ఇది రోమిల థాపర్ తో సహా ఎంతో మంది భారతీయ చరిత్రకారుల వద్ద కనిపించే భావజాలం. సర్దుకు పోవడం మనకు అలవాటైపోయింది. అయితే ఈ పుస్తకం లో బౌధ్ధాన్ని కూడా కాస్త విమర్శనాత్మక  దృష్టి తో చూసారనిపిస్తుంది బౌధ్ధ సన్యాసుల రాజకీయ క్రీడలు కూడా చెప్పబడ్డాయి. 

మొత్తం మీద తెలుగు లో ఒక మంచి ప్రయత్నం. మతపరమైన విషయాలు, వాటిని చెప్పిన తీరు తో నేను ఏకీభవించలేకపొవచ్చేమో కానీ. చరిత్ర పరంగా చదవుకోవడానికి ఇది ఒక మంచి పుస్తకము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: