Skip to content
October 10, 2013 / subramanyam

RIP SriHari Garu …


శ్రీహరి గారు కాలం చేసారంటే ఎంతో బాధగా ఉంది. ఏ పాత్ర చేసినా తనదైన శైలి లో దానికి న్యాయం చేసారాయన. తన సంపాదన లో కూడా 50 శాతం దాన ధర్మాలు చేసిన వ్యక్తి. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. మంచివాడనేనేమో భగవంతుడు కూడా తొందరగా తీసుకుపోయాడు. అయినా సిరివెన్నెల గారు వ్రాసినట్టు 

తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాల ఆయువిచ్చిన వాడినేది కొరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది 

అని, ఏమనగలం.

విలనీతో భయపెట్టి.. హీరోగా అభిమానులను కేరింతలు కొట్టించి.. కామెడీతో నవ్వించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రల్లో జీవించిన శ్రీహరి.. అశేష తెలుగు సినీ ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేసి చిన్నవయసులోనే మరలిరాని లోకాలకు తరలిపోయారు! – See more at: http://www.andhrajyothy.com/node/9184#sthash.a3RATZo5.dpuf 

ఆయన చేసిన కొన్ని పాత్రలను మనం మరువలేం. ముఖ్యంగా అన్యయాన్ని ఎదిరించే పాత్రలు , బతుకు పోరాటాన్ని చూపుతూ ఉండే ఉద్యమకారుని పాత్రల్లో ఆయన నటన అద్భుతం. ఈ పాట చూడండి. ఫేస్ బుక్ లో చాలామంది ఆయన మృతి కి సంతాప సూచకంగా ఈ పాటనే షేర్ చేస్తున్నారు.

ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం.

One Comment

Leave a Comment
  1. Haritha / Oct 10 2013 2:58 pm

    నిజంగా ఒక గొప్ప వ్యక్తిని, మంచి నటుడిని కోల్పోయాము….

    Like

Leave a reply to Haritha Cancel reply