Skip to content
June 30, 2013 / subramanyam

ఉత్తరాఖండ్ వరద బాధితులు :: తెలుగుదేశం పార్టీ


ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం తెలుగుదేశం పార్టీ వారు చేసిన/చేస్తున్న సేవ గొప్పది. అసలే ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం, వారికి ఉన్న పరిమితులు వారికి uttarakhandఉన్నాయి,ఎన్ని రాష్ట్రాల వారినో వారు వెనక్కి పంపించాల్సి ఉండింది. దీనికి తోడు ఆ ప్రభుత్వం కాస్త ఆలస్యం గానే స్పందించింది. బహుసా దీనిని గుర్తించే మోడీ, అశోక్ గేహ్లాట్(రాజస్థాన్ ముఖ్యమంత్రి), చవాన్ (మహరాష్ట్ర ముఖ్యమంత్రి) వంటి వారు ఉత్తరాఖండ్ వెళ్ళి తమ తమ రాష్ట్రాల ప్రజలను స్వంత ఊర్లకు పంపడానికి నడుంబిగించారు. మన ముఖ్యమంత్రి గారు దీనిపై ఏం చేసారో తెలియదు, మన కేంద్ర మంత్రి గారు ఒకసారి వెళ్ళి వచ్చారు ఐయినా పూర్థి స్థాయి లో మనవాళ్ళకు సాయమందలేదు. దీనికి తోడు అసలు హిందీ రాని తెలుగు ప్రజలు పడ్డ అవస్థలు వర్ణనాతీతం.

ప్రతిపక్షం లో ఉంటూ, అమెరికా నుండి వచ్చీ రాగానే తన కేడర్ ని టీంలుగా విభజించి తను స్వయం గా ఉత్తరాఖండ్ ఢిల్లీ ల మధ్య తిరుగుతూ, బాధితులకోసం ప్రత్యేక బస్సులు నడుపుతూ వారికి ఆహారం, మందులు అందించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించుకుంటూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నిజం గానే బాగా కష్టపడ్డారు. సర్వం కోల్పోయిన యాత్రికులకు ఆర్ధిక సహాయం చేయడం, ఇంటికి వచ్చే దాక ఖర్చులు భరించడం, ప్రత్యేక విమానాలలో వారిని హైదరాబాద్ తరలించడం, మేమున్నామంటూ ధైర్యం చెప్పడం నిజంగా అభినందనీయం.

ఇన్ని చేసిన వారిపై కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు దుమ్మెత్తిపోయడం ఎంత వరకు సమంజసం ? అసలు వారు చేసినదేమిటి?

తెలుగుదేశం వాళ్ళు వెళ్ళాక, చంద్రబాబునాయుడిగారి బలమైన వ్యవహారశైలి దక్షత చూసి అధికార పార్టీ వారు కూడా అక్కడకు వెళ్ళి కొంత లో కొంత సహాయం చేసారు. అది Chandrababu--1315ప్రజల పై ప్రేమో లేక ఎక్కడ ఆయనకి మంచి పేరు వస్తుందో మనం వెనక పడిపోతామో అని భయమో తెలియదు కాని కొంత పని చేసారు అలాగే కొంత హడావిడీ జరిగింది.

ఇహ పోతే, వైకాపా, తెరాసలు అసలు ఈ విషయం లో ఏమి చేసాయో తెలియదు. నామమాత్రపు విచారం వ్యక్తం చేసారు కాని తమ శ్రేణులను ఆ ప్రాంతాలకు పంపినట్టు కాని, సహాయ చర్యలలో పాల్గొనట్లు కానీ సమాచారమేమీ లేదు.

నిన్న (గురువారం నాడు) ఒక ఛానెల్ లో వైకాపా యొక్క అనాసక్తత వ్యూహాత్మక మౌనమని, మైనారిటీల మనోభావాలు దెబ్బతింటయేమో, అలా జరిగితే దాని వలన ఎన్నికలలో తాము నష్టపోతామేమోనన్న భయంతో వైకాపా వారు అలా వ్యవహరించారని చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. అదే నిజమైతే అంత కన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఈ దేశంలో ? మైనారిటీలు అలా ఆలోచిస్తారని నేను అనుకోవడం లేదు. విపత్తు ఏదైనా విపత్తే. విపత్తులను మానవతాదృక్పథం తో చూడాలి తప్ప మరో విధంగా చూడకూడదు. మైనారిటీలు కూడా అలాగే చూస్తాయని నేను నమ్ముతున్నా, ఎందుకంటే దైవం అనేది ఉన్నది అని నమ్మని కమ్యూనిష్టులు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒవైసీ గారు ప్రాతినిథ్యం వహించే ఎం ఐ ఎం పార్టీ కూడా విరాళాలు సేకరించి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే విశ్వాసాలతో సంబంధం లేకుండా దీనిని మానవాళి ఎదుర్కున్న ఒక విపత్తుగా అంతా చూస్తున్నారు. మరి ఇలాంటప్పుడు వైకాపా వారు మైనారిటీల మనోభావాలంటూ చెప్పే విషయలను(ఆ ఛానెల్ వారు చెప్పినవి నిజమైతే) ఎలా అర్థం చేసుకోవాలి? మైనారిటీలను చూపించి వైకాపా తమ అలసత్వాన్ని, ఈ ఘటన పట్ల తమ ఉదాసీనతని కప్పిపుచ్చుకుంటోదని నా అభిప్రాయం.

సరే తాము చెయ్యకపోతే చెయ్యలేదు,కుదరలేదో,  లేక త్వరగా స్పందించలేకపోయామనో అనుకోవాలి తప్పచేసిన వారిపై రాళ్ళు వేయడం, బురద జల్లడం లాంటి కార్యక్రమాలు మాత్రం మంచివి కావు.

విపత్తులు వచ్చినప్పుడు స్పందించడం నాయకుల కర్తవ్యం, వారు బరిలోకి దిగితే వారి అనుచరులు వేలమంది స్వచ్చందంగా వస్తారు, దీనివలన కష్టం లో ఉన్న వ్యక్తిని త్వరగా ఆదుకోవడం సాధ్యమవుతుంది.

ఈ ఉత్తరాఖండ్ విపత్తు విషయం లో మాత్రం మన రాష్ట్రం లో నిజంగా నాయకుడి లా స్పందించినది ఒక్క చంద్రబాబునాయుడు గారు మాత్రమే. ఆయన పని చేసి మాటలు పడడం దురదృష్టకరం.

One Comment

Leave a Comment
  1. Haritha Sree / Jun 30 2013 5:50 pm

    Nice to see atleast few politicians helping people when severely in need…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: