Skip to content
April 15, 2012 / subramanyam

దేవస్థానమును చూచితిన్


          ఎటూ విశ్వనాథ్ గారు ఉన్నారు, పేరు కూడా బాగుంది, బాల సుబ్రహ్మణ్యానిది కూడా మంచి పాత్రట, చూద్దాం పదవొయ్, అనుకుంటూ వెళ్ళాం ఈ సినిమాకి. ఎంత కాదన్నా అస్సలు అంచనాలు ఐతే లేకుండా వెళ్ళలేము కదా, సో అలా వెళ్ళాము అనమాట. ఐతే సినిమా మాత్రం మమ్మల్ని నిరాశ పరచలేదు. “చాలా రోజుల తరువాత ప్రేక్షకులను ఆలొచింప జేసే సినిమా ఒకటి వచ్చింది తెలుగులొ” అనుకుంటూ వెనక్కి వచ్చాం ఇద్దరం.

          ఇద్దరు మనుషులు, ఒకరికి ప్రపంచమే ఇల్లైతే మరొకరికి ఇల్లే ప్రపంచం. ఈ ఇద్దరి అనుబంధము, వారి జీవితాలలో చోటు చేసుకున్న విశేషాలు, వారిద్దరూ కలిసి చేసిన పనులు , ఈ విషయాల చుట్టూ నిర్మింపబడింది ఈ దేవస్థానం.

          పెద్దాయన నటన ఎప్పటి లాగే అద్భుతం,బాలసుబ్రహ్మణ్యం ఆమని నువ్వా నేనా అన్నట్టు నటించారు, మొత్తం సినిమా అంతా వీరి ముగ్గురి మధ్యే ఉండడం, నటన పరంగా అద్భుతం అనే చెప్పాలి. ప్రత్యేకంగా బాలసుబ్రహ్మణ్యం చాలా చాలా చాలా బాగా చేసారనిపించింది.  నటుడి గా ఆయన యొక్క అత్యుత్తమ చిత్రం ఇదే నేమో. సంగీతం కూడా చాల బాగుంది, సరస్వతి అమ్మవారి మీద ఉన్న పాట,  అలాగే సాంబయ్య-సోమయ్య పాట అద్భుతం.  

          కథ పరంగా మంచి కథ, మానవీయ కోణం కూడా అద్భుతం, కానీ ఇంకా బాగా తీయ్యొచ్చనిపించింది. ప్రథమార్థం కథనం లోను వేగం కనిపించింది, ద్వితీయార్థం కాస్త నెమ్మది గా సాగుతున్నట్టనిపించింది. కాని చివర్లో అనూహ్యమైన మలుపు తో భలే ముగించాడే అనిపించింది నాకు. ఇంకా బగా తియ్యొచ్చేమొ కాని ఉన్నంతలో బానే ఉంది.

          విశ్వనాథ్ గారి సినిమాలలో కనబడే కళాతృష్ణ ఇందులోనూ కనబడుతుంది. వారి దర్శకత్వం కాక పోయినా హరి కథ, బుర్ర కథ వంటి వాటిని కాపాడుకొవాలన్న సందేశంలొ ఆయన ముద్ర మనకు కనబడుతుంది. అసలు జీవిత కాలంలో ఒక కళ లో ప్రావీణ్యత సాధించడం నిస్సందేహంగా గొప్ప విషయం. అలా ప్రావీణ్యత సాధించి తమ నైపుణ్యం తో మనల్ని ఆకట్టు కునే వారిని ఎందరినో చూస్తాం , అభినందిస్తాం. కానీ తమ కళ ద్వారా ప్రజలని ఆలొచింప జేయగలగడం, ఒక కళ ద్వారా మరో కళ యొక్క గొప్ప తనాన్ని చెప్పడం అందరు కళాకారులకూ సాధ్యమయ్యే పని కాదేమో అనిపిస్తుంది.  అందుకే బహుశా పెద్దాయనని కళాతపస్వి అన్నారేమో.

ఖచ్చితం గా వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. వేదం తరువాత మనని మళ్ళీ అంత ఆలోచింప చేసే సినిమా ఇదేనేమో.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: