Skip to content
August 15, 2011 / subramanyam

శ్రీలు పొంగిన జీవగడ్డై


రాయప్రోలు వారి కలము నుండి జాలు వారిన ఒక అద్భుతమైన  పాట , లీడర్ సినిమా లో ఈ పాట యొక్క ఒక చిన్న భాగాన్ని వాడుకున్నారు.  ఇక్కడ ఈ పాట తాలూకు వీడియో (సినిమా లోది కాదు) చూడండి.

ఈ పాట తాలూకు పూర్తి సాహిత్యం ఇక్కడ ఉంది .

శ్రీలు పొంగిన జీవగడ్డై
పాలు పారిన భాగ్యసీమై  
రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా || (శ్రీలు పొంగిన) ||

విపిన బంధుర వృక్ష వాటిక
ఉపనిషన్మధువొలికెనిచ్చట | 
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తుల
మండి మెరసిన మహితరణ కధ |
పండగల చిక్కని తెలుంగుల 
కలిపి పాడవె చెల్లెలా || (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

లోకమంతకు కాక బెట్టిన 
కాకతీయుల కదనపాండితి |
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవే చెల్లెలా || (శ్రీలు పొంగిన)||

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిచి త్రిళ్ళీ |
భంగపడని తెలుంగునాధుల
పాట పాడర తమ్ముడా  || (శ్రీలు పొంగిన)||

మేలి కిన్నెర మేళవించీ
రాలు గరగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత 
పథము పాడవె చెల్లెలా || (శ్రీలు పొంగిన)|| 

 In English Script

raayaprOlu vaari kalamu nunDi jaalu vaarina oka adbhutamaina  paaTa , lIDar sinimaa lO I paaTa yokka oka chinna bhaagaanni vaaDukunnaaru.  ikkaDa ee paaTa taalUku vIDiyO (sinimaa lOdi kaadu) chUDanDi.

ee paaTa taalUku poorti saahityam ikkaDa undi .

SrIlu pongina jIvagaDDai
paalu paarina bhaagyaseemai  
raalinadi ee bharata khanDamu
bhakti paaDara tammuDaa !(2)

vEda Saakhalu velasenichchaTa
aadikaavyam balare nichchaTa |
baadaraayaNa paramaRshulaku
paadu summidi chellelaa || (SrIlu pongina) ||

vipina bandhura vRksha vaaTika
upanishanmadhuvolikenichchaTa | 
vipula tatvamu vistarinchina
vimala talamidi tammuDaa || (SrIlu pongina)||
paanDavEyula padunukattula
manDi merasina mahitaraNa kadha |
panDagala chikkani teluMgula 
kalipi paaDave chellelaa || (SrIlu pongina)||

dESagarvamu deepti chendaga
dESacharitamu tEjarillaga |
dESamarasina dhIrapurushula
telisi paaDara tammuDaa || (SrIlu pongina)||

lOkamantaku kaaka beTTina 
kaakatIyula kadanapaanDiti |
chIkipOvani chEvapadamula
chErchi paaDavE chellelaa || (SrIlu pongina)||

tungabhadraa bhangamulatO
pongi ningini poDichi triLLI |
bhangapaDani telungunaadhula
paaTa paaDara tammuDaaa  || (SrIlu pongina)||

mEli kinnera mELavinchI
raalu garagaga raagametti
paalatIyani baalabhaarata 
pathamu paaDave chellelaa || (SrIlu pongina)||

 

 

 

 

 
 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: